The Good Samaritan

Sermon  •  Submitted
1 rating
· 56 views
Notes
Transcript

నా పొరుగువాడు

లూకా 10:25-37 St. Luke 10:25-37

పందెములో ఓడి పోయిన వాడు తన ఓటమి ఒప్పుకోడు. వాడు ఇతరుల మీద నిందలు వేయ మార్గాలు వెదకు తాడు. ఇక్కడ ఈధర్మ శాస్త్రోప దేషకుడు చేచిన పని అదే. యేసు ప్రభువులో తప్పు చూప వచ్చి మంచి మాటలతో ఆయనను యిరికింప చూచాడు. అందుకే నిత్య జీవము పొంద నేనేమి చేయాలి అని అడిగాడు. ఏ ఉద్దేశముతో అడిగినా మన ప్రభువు అతనికి మంచిగానే జవాబు యిచ్చాడు. నీవు ఏమి చదువు కున్నావు అని. చక్క గానే జవాబు నిచ్చాడు ఈ ధర్మశాస్త్రోప దేషకుడు. చదివాడు తాను నేర్చుకున్నది. ప్రభువు బాగుంది ఇక నీవు వెళ్ళు అన్నాడు. అయినా అతడు ప్రభుని వదల లేదు. నా పోరుగువాడేవడు అని అతిపురి ప్రశ్న వేశాడు. ప్రభువు విసుకు కోన కుండ ఈ కథ చెప్పాడు.

ఆపదలో ఉన్నవాడు పొరుగువాడు: సాధారముగా ఎరికో మార్గములో జరిగే యధార్తమే ఇది. అందరికి తెలిసిన వార్తనే ఇది. ఆపదలో ఉన్నాడు. కోర ప్రాణముతో ఉన్నాడు. లేవలేని పరిస్తిలో ఉన్నాడు. సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. యాజకుడు వచ్చాడు, అనునిత్యము దేవుని సన్నిధిన ప్రార్థన సేసేవాడు. మంచివాడు. సహాయము వచ్చింది లే అని ఆశ పడ్డాడు ఈ దొంగల చేతిలో బలిఅయిన వాడు. చూచి ప్రక్కన వెళ్ళాడు ఈ పూజారి. పరమార్థము వేరు పరిచర్య వేరు అని అనుకొనే వారు చాల మంది ఉన్నారు మనలో. అందుకే తమ పొరుగు వాణ్ని గుర్తించక పోతున్నారు ఈ వేష దారి వలే.

అక్కరలో వున్నవాడు పొరుగువాడు: ధనము పోయింది, గుడ్డలు పోయాయి, గాయాలతో వున్నాడు. చాల అక్కరలో వున్నాడు. ఎందరు తమ కెదురుగా తిండి లేక, గుడ్డ లేక, మందులు లేక, అక్కరలో ఉన్నారు? వచ్చాడు లేవియుడు, దేవాలయములో దేవుని పని చేసే వాడు. దేవుని సేవ అవసరాలు తిర్చేవాడు కాని అవసరతలో ఉన్న తోటి మానవుణ్ణి ఆదుకోలేదు. నా జీవితం ప్రభువుకు అంకితం అంటాము కాని అక్కరలో వున్నా వాణ్ని ఆడుకోలేము. వెళ్ళు నీవు ఆలాగు చేయుము అంటున్నాడు ప్రభువు చివరలో. అంటే అక్కరలో ఉన్నవాని ఆదుకోమని. మానవ సేవే దేవుని సేవ అని మరచి పోరాదు.

అంటరానివాడు: ఇక ఏంటి వానిగతి అని అందరు ప్రబువు ఏమిచేపుతాడో అని ఎదురు చూస్తున్న సమయములో, ప్రభువు అందరిని ఆశ్చర్య పరుస్తూ అంటరాని వాడయిన సమరయ్యుని ప్రవేశ పెడుతున్నాడు. వాడు జాలి పడి దొంగల చేతిలో చిక్కిన వానిని ఆదుకొన్నాడు. సిగ్గు చేటు, గోప్పవారికి గొప్పలు చెప్పుకొనే వారికి, దేవుని వాక్యాన్ని బాగుగా ఎరిగిన వారికి. అనామకుడు ఆదు కొన అన్నివున్నవారు తప్పుకొని పోయారు. ప్రభుని కథ లోని సత్యమిది- ఏమిలేని అంతరారి వాడు ఆదుకొన్నాడు.

వెళ్ళు నీవు ఆలాగు చేయుము అన్న ఆయన మాటలు మనకు ఆణిముత్యాలు. ఆలయములో నీవు చేసే ప్రార్తనలకంటే నీ పొరుగునున్న వాణ్ని ఆదుకో. అప్పుడే ప్రభువు నీ ప్రార్థన వింటాడు.

-పాస్టరు కటారి.

Related Media
See more
Related Sermons
See more